Take a fresh look at your lifestyle.

రెండు అఫిడవిట్‌లలో రూ.100 కోట్లకు పైగా తేడా!: హీరో విజయ్‌కి హైకోర్టు నోటీసులు

0 308
  • తిరుచ్చి, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విజయ్
  • రెండు అఫిడవిట్‌లలో వేర్వేరు ఆస్తుల వివరాలు పేర్కొన్నారంటూ పిటిషన్
  • విజయ్, ఈసీ, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ
2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ప్రకటించిన ఆస్తులలో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం, విజయ్‌కు, ఆదాయపు పన్ను డైరెక్టర్ జనరల్, భారత ఎన్నికల సంఘం, పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి (తూర్పు) నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

విజయ్ తిరుచ్చి, పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. విజయ్ రెండు నియోజకవర్గాల్లో సమర్పించిన అఫిడవిట్‌లలో తేడాలు ఉన్నాయంటూ చెన్నైకి చెందిన విఘ్నేష్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెరంబూర్‌లో సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను రూ.115 కోట్లుగా, తిరుచ్చిలో సమర్పించిన అఫిడవిట్‌లో రూ.220 కోట్లుగా పేర్కొన్నారని పేర్కొన్నారు. ఇంత తేడా ఎందుకు చూపించవలసి వచ్చిందో వివరించేలా ఎలాంటి అనుబంధ పత్రాన్ని విజయ్ ఇవ్వలేదని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.