Take a fresh look at your lifestyle.

పూసుకున్నోళ్లకు పూసుకున్నంత… ‘బర్నాల్’ ఫొటోతో కవిత టీఆర్ఎస్ పార్టీ ట్వీట్

0 12,593
  • టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీ ప్రకటన
  • ఒరిజినల్ ఒరిజినలే అంటూ బీఆర్ఎస్ ట్వీట్
  • బర్నాల్ ఫొటోలను పంచుకున్న కవిత టీఆర్ఎస్

కవిత స్థాపించిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్ఎస్) పార్టీ ‘ఎక్స్’లో ఖాతాను తెరిచింది. తాజాగా ఆ పార్టీ చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. “పూసుకున్నోళ్లకు పూసుకున్నంత” అంటూ భారీ ట్రక్కులలో బర్నాల్ ఉన్నట్లుగా ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమం వేదికగా పంచుకుంది. తమ పార్టీని, పార్టీ పేరును చూసి రగిలిపోయేవారికి బర్నాల్ అన్నట్లుగా ఈ ఫొటోను షేర్ చేసింది.

అంతకుముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆసక్తికర ట్వీట్ చేసింది. “ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే” అంటూ అసలైన కోల్గేట్ పేస్టును, డూప్లికేట్ పేస్టును (కూల్‌గేట్ పేస్టు), అలాగే ఒరిజినల్ బిస్లరీ వాటర్ బాటిల్, డూప్లికేట్ వాటర్ బాటిల్‌ను (బ్రిస్లీ వాటర్ బాటిల్) బీఆర్ఎస్ పోస్టు చేసింది.

కల్వకుంట్ల కవిత మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పార్టీని ప్రకటించారు. పాతికేళ్ల క్రితం కేసీఆర్ స్థాపించిన ‘టీఆర్ఎస్’ పేరు వచ్చేలా కవిత తన పార్టీ పేరును ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఒరిజినల్ ఒరిజినలే అని చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. ఇప్పుడు కవిత టీఆర్ఎస్ పార్టీ బర్నాల్ ఫొటోను ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.