డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్.
ఈ రోజు వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్, సుందరయ్య పార్క్ ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాకర్స్ మరియు వాకర్స్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 301 గవర్నర్ డా. బి. గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ముందుగా ప్రెసిడెంట్ ఎస్. మనోహర్ రెడ్డి ని శాలువాతో సత్కరించారు. అలాగే AVP మురళీ కృష్ణ గవర్నర్ ని శాలువాతో సత్కరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అదేవిధంగా పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నాగభూషణం ,DGE శైలజ మోహన్ , పాస్ట్ AVP సంపత్ రెడ్డి , మరియు పాస్ట్ ప్రెసిడెంట్స్ పి.వి. నిరంజన్ రెడ్డి , ఎ. శ్రీనివాస్ రెడ్డి , రాజన్న , శంకర్ రావు కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు.
బ్రేక్‌ఫాస్ట్ స్పాన్సర్స్ అయిన అశోక్ , కల్కూర్ రాజు మరియు కార్యక్రమంలో పాల్గొన్న అన్ని వాకర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ ఎస్. మనోహర్ రెడ్డి ,సెక్రటరీ ఎం. దశరథ్ ,ట్రెజరర్ రవికుమార్ ఇతరుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అందరూ డా. బి.ఆర్. అంబేద్కర్ గారికి పుష్పాంజలి ఘటించి, ఆయన గొప్ప సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా విజయవంతంగా ముగిసింది.