సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామం లో అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
* రాష్ట్ర ప్రజలందరికి డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు
* ఎన్నో ఎళ్లుగా ఉన్న లోటు నేటితో తీరిపోయింది.. తడకపల్లిలో అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుచేయడం చాలా సంతోషంగా ఉంది..
* ఇచ్చిన మాట ప్రకారం సాయి గారు, ఆయన కుమారుడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుచేసినందుకు వారిని అభినందిస్తున్నా…
* గ్రామం మొదటిలోనే అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుచేయడం చాలా సంతోషంగా ఉంది..ఎవరు గ్రామానికి వచ్చిన మొదట ఆహ్వానం పలికేది అంబేద్కర్ గారే…
* అంబేద్కర్ గారి స్ఫూర్తిని రగిలించే విధంగా గ్రామంలో ఆయన జయంతి రోజున విగ్రహాం ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషం…
* కొంతమంది అనుకున్నట్లు అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికి మాత్రమే నాయకుడు కాదు…ఆయన అందరివాడు..కొంతమంది కావాలనే ఆయన్ను ఒక వర్గానికి ఆపాదించే కుట్రచేస్తున్నారు.
* ఇవాళ భారతదేశం ప్రపంచంలో అదిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా ఎదుగుతుంది అంటే అది అంబేద్కర్ గారు రచించిన స్పూర్తి.
* అమెరికాలాంటి దేశంలోనే మహిళలకు ఓటు హక్కు రావాలంటే దశాబ్దాల కాలం పట్టింది..కానీ మన దేశానికి స్వతంత్ర్యం వచ్చిన వెంటనే..రాజ్యాంగం ద్వారా ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి బాబాసహేబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
* నేటి యువత అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి..పేదరికం అనేది చదవుకోవడానికి అడ్డు రాకోడదని అంబేద్కర్ గారిని చూసి నేర్చుకోవాలి
* అంబేద్కర్ మంచి జీవితం అనుభవించాలంటే…విదేశాల్లో ఎక్కడైనా స్థిరపడేవారు..కానీ దేశంలోని అణగారిన వర్గాల కోసం పోరాడి విజయం సాధించిన మహోన్నతవ్యక్తి అంబేద్కర్
* అలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలను రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అలివికానీ హామీలు ఇచ్చి..గదెనెక్కి, నేడు ఏమిచేయలేక చేతులు ముడుచుకుని కూర్చుంది..
* చదవుకున్న పిల్లలకు 10వ తరగతి పాస్ అయితే రూ.10వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.25 వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.1లక్ష, పీజీ పాస్ అయితే రూ.2 లక్షలు ఇస్తామని చెప్పి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను నమ్మించి మోసం చేశారు.
* ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు రాకా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం.
* కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు ఒక్క రూపాయికూడా ఇవ్వంలేదు.
* ఆనాడు కేసీఆర్ ఒక్కో విద్యార్థికి రూ.20లక్షలు ఇచ్చి విదేశాల్లో చదివించారు
* దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే..సచివాలయానికి అంబేద్కర్ గారి పేరుపెట్టిన ఒకేఒక్క నాయకుడు మన కేసీఆర్ గారు
* ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున్న కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుచేస్తే..ఇది కేసీఆర్ పెట్టించుండు అని రేవంత్ రెడ్డి దానికి తాళం వేపించి పెట్టిండు..
* కనీసం అంబేద్కర్ కు దండ కూడా వేయని సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి
* ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం
* యువత ఆన్‌లైన్ గేమ్ ఆడి జీవితాలు నశనం చేసుకోవద్దు..బెట్టింగులు ఆడి డబ్బులు వృదా చేసుకోవద్దు..
* డ్రగ్స్, మత్తుపదర్థాలకు వ్యసనాలుకు భానిసలు కాకుండా..డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో ముందుకు సాగండి.