Take a fresh look at your lifestyle.

తెలంగాణలో మండుతున్న ఎండలు… పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

0 32

తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే భానుడి భగభగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, నిర్మల్, కరీంనగర్, వనపర్తి, కొమురంభీమ్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో బుధవారం వడగాలులు వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర, దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువ కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.