Take a fresh look at your lifestyle.

ఎదుర్కొన్న తొలి బంతికే వైభ‌వ్ గోల్డెన్ డకౌట్‌.. కావ్య మార‌న్‌ వైల్డ్ సెల‌బ్రేష‌న్స్‌ చూశారా?

0 34

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మరోసారి తన హావభావాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆట పట్ల ఆమెకున్న ఆసక్తి, జట్టు పట్ల చూపే ఎమోషన్స్‌తో కావ్య తరచూ వార్తల్లో ఉంటారు. తాజాగా ఆమె వైల్డ్‌ రియాక్షన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వివరాల్లోకి వెళితే… సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ప్రఫుల్ హింగే వేసిన బౌన్సర్‌ను భారీ షాట్ ఆడేందుకు వైభవ్ ప్రయత్నించగా, బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది.

ఆ సమయంలో స్టాండ్స్‌లో మ్యాచ్ చూస్తున్న కావ్య మారన్ తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. వెంటనే తన సీటులోంచి లేచి నిలబడి “క్యాచ్.. క్యాచ్..” అంటూ అరిచారు. వికెట్ కీపర్ సలీల్ అరోరా ఆ క్యాచ్‌ను అందుకోగానే, కావ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్టాండ్స్‌లోనే గంతులు వేస్తూ ఆ వికెట్‌ను ఆస్వాదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కావ్య మార‌న్ వైల్డ్ సెల‌బ్రేష‌న్స్‌పై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.